Saturday, December 21, 2024

జో రూట్ కీలక ఇన్నింగ్స్… ఇంగ్లండ్ 282/7

- Advertisement -
- Advertisement -

రాంచీ టెస్టులో జో రూట్ జోరు పెంచాడు. కీలక ఇన్నింగ్స్ ఆడి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు. 221 బంతుల్లో 103 పరుగులు చేశాడు. ఈ సిరీస్ లో అతనికి ఇదే తొలి శతకం. తొలి సెషన్ లోనే 5 వికెట్లుపడ్డా జో రూట్ మాత్రం నిలకడగా ఆడుతూ క్రీజులో పాతుకుపోయాడు. ఓ వైపు వికెట్లు పడుతున్న తడబడకుండా ఆడుతూ 100 పరుగులు చేశాడు. టెస్టుల్లో టీమిండియాపై అత్యధిక సెంచరీలు చేసిన (10) చేసిన విదేశీ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అటు భారత బౌలర్లు కట్టదిట్టంగా బంతులు వేస్తూ ఇంగ్లండ్ బ్యాటర్లను ఒత్తిడికి గురిచేస్తున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు 86 ఓవర్లు ఆడి 7 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News