Saturday, December 21, 2024

ముగిసిన తొలిరోజు ఆట.. ఇంగ్లండ్ 302/7

- Advertisement -
- Advertisement -

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోరు 90 ఓవర్లలో 302/7. ప్రస్తుతం జో రూట్ (106*), ఆలీ రాబిన్సన్ (31*) క్రీజులో నాటౌట్‌గా ఉన్నారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ కేవలం 112 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. అయితే, రూట్ బెన్ ఫోక్స్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇంగ్లాండ్‌ను తిరిగి ఆటలోకి తీసుకువచ్చాడు. భారత్ తరఫున ఆకాశ్ దీప్ మూడు వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీశాడు. వీరితో పాటు రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్‌ తీశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News