- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఐదుగురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఈమేరకు సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. సిద్దిపేట కలెక్టర్‌గా మిక్కిలినేని మను చౌదరి నియామకం అయ్యారు. జనగామ కలెక్టర్‌గా రిజ్వాన్ బాషా షేక్ నియామకం అయ్యారు. జనగామ కల్టెకర్ శివలింగయ్యను జిఏడిలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శిగా శైలజ రామయ్యర్‌ను అదనపు బాధ్యతలు అప్పగించారు.
- Advertisement -