Monday, December 23, 2024

గ్రూప్-1 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మార్చి 14తో ముగియనున్న గడువు

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల కొత్తగా విడుదల చేసిన గ్రూప్-1 దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం(ఫిబ్రవరి 23) ప్రారంభమైంది. మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు దరఖాస్తు గడువు ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు టిఎస్‌పిఎస్‌సి అధికారిక వెబ్‌సైట్(https://www.tspsc.gov.in/)ను ద్వారా గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో గ్రూప్-1 దరఖాస్తు చేసిన అభ్యర్థులు సైతం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని టిఎస్‌పిఎస్‌సి స్పష్టం చేసింది.

గత నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న వారికి ఫీజు నుంచి మినహాయింపు కల్పించింది. 563 పోస్టులతో ఇటీవల టిఎస్‌పిఎస్‌సి గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, గత ప్రభుత్వం 2022లో 503 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి రెండుసార్లు ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించింది. ఒకసారి పేపర్ లీక్ అవడం కారణంగా, మరొకసారి నిర్వహణ లోపం కారణంగా రెండుసార్లు నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుత ప్రభుత్వం గత నోటిఫికేషన్‌లోని 503 పోస్టులకు మరో 60 పోస్టులను కలిపి కొత్తగా 563 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే, వరుసగా రెండుసార్లు పరీక్ష రద్దు కావడం, రెండేళ్లు ముగియడంతో.. వయో పరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది. దీంతో 46 ఏళ్ల వరకు అభ్యర్థులు ఈ గ్రూప్ 1 పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను మే లేదా జూన్ నెలలో నిర్వహించనున్నట్లు టిఎస్‌పిఎస్‌సి తెలిపింది. మెయిన్ పరీక్షలను సెప్టెంబర్, అక్టోబర్‌లో నిర్వహించనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News