Monday, December 23, 2024

34% మంది మహిళలు ఉద్యోగాలు వదిలేస్తున్నారు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దాదాపు 34 శాతం మంది మహిళలు పని-, జీవితాన్ని సంతులనం చేయలేక పని చేస్తున్న కంపెనీల నుండి నిష్క్రమిస్తున్నారని సర్వే చెబుతోంది. అలాగే కేవలం 4 శాతం మంది పురుషులు మాత్రమే ఇలా చేస్తున్నారు. ది ఉదైతి ఫౌండేషన్, సెంటర్ ఫర్ ఎకనామిక్ డేటా అండ్ అనాలిసిస్ (సెడా) సహకారంతో ఉమెన్ ఇన్ ఇండియా ఇంక్ హెచ్‌ఆర్ మేనేజర్స్ సర్వే నివేదికను ఆవిష్కరించింది. 73 శాతం భారతీయ సంస్థలు లింగ వైవిధ్య లక్ష్యాలను నిర్దేశించినప్పటికీ, కేవలం 21 శాతమే మద్దతు వ్యూహాలను కలిగి ఉన్నాయి. 55 శాతం కంపెనీలు మహిళల అభివృద్ధి కోసం లక్ష్యాలను నిర్దేశించగా, కేవలం 37 శాతం మంది మాత్రమే నియామకంలో లింగ అసమానతలను పరిష్కరిస్తున్నారు.

59 శాతం సంస్థలు తప్పనిసరి అంతర్గత ఫిర్యాదుల కమిటీలు లేవు, 37 శాతం ప్రసూతి సెలవు ప్రయోజనాలను అందించడంలో విఫలమయ్యాయి. 17.5 శాతం మాత్రమే పిల్లల సంరక్షణ సౌకర్యాలను అందిస్తాయి. స్త్రీ పురుషులు కలిసి పనిచేసే ప్రదేశాలలో లింగ భేదాలను, అసమానతలను అక్కడి నుండి తరలించడంలో సహాయపడే సంభాషణలు ఈ సందర్భంగా చోటుచేసుకున్నాయని ఉదయి ఫౌండేషన్ సిఈవో పూజా శర్మ గోయల్ వ్యాఖ్యానించారు. ఈ అధ్యయనం ఎఫ్‌యంసిజి, ఫార్మా, రిటైల్, ఐటి సహా వివిధ రంగాలలోని 200 మంది సీనియర్ హ్యూమన్ రిసోర్స్ మేనేజర్‌లకు ఆన్‌లైన్ సర్వేలను నిర్వహించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News