Monday, December 23, 2024

నిందితురాలిగా కవిత

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం

26న విచారణకు రావాలని సిబిఐ ఆదేశం

మన తెలంగాణ/హైదాబాద్ : ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బి ఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితను సిబిఐ ఇందులో నిందితురాలిగా పరిగణించింది. ఈ మేరకు కవితకు సిబిఐ నోటీసులు కూడా ఇచ్చింది. ఈ కేసులో ఫిబ్రవరి 26న విచారణకు రావాలని నోటీసుల్లో వెల్లడించింది. ఈ కేసు లో ఇప్పటికే కవితను సిబిఐ మూడుసార్లు ప్ర శ్నించింది. లిక్కర్ కేసులో నిందితురాలిగా సె క్షన్ 41ఎ కింద నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులను సవరి స్తూ తాజాగా మరోసారి సిబిఐ నోటీసులు ఇచ్చింది.

లిక్కర్ కేసులో సిబిఐ హైదరాబాద్‌లోని కవిత నివాసంలో ఆమెను విచారణ చే సి, ఆమె స్టేట్‌మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కూడా కొన్నిసార్లు కవితను ఢిల్లీలోని తమ కార్యాలయానికి ఆహ్వానించి ప్రశ్నిం చింది. ఆఖరు సారి గత ఏడాది జనవరి 16న విచారణకు రావాల్సిందిగా కవితకు ఇడి నోటీసులిచ్చింది. అయితే ఇడి విచారణకు పిలవడాన్ని సవా లు చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున కవిత తాను విచారణకు హాజరు కాలేనని ఇడి అధికారులకు లేఖ రాశారు. ఆ తర్వాత ఇడి నుంచి కవితకు ఎలాంటి సమాధానం రాలేదు. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌పై మళ్లీ ఈ నెల 28న విచారణ జరగనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News