Friday, December 20, 2024

జో రూట్ అజేయ శతకం

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్ 302/7, భారత్‌తో నాలుగోటెస్టు

రాంచీ: భారత్‌తో శుక్రవారం ప్రారంభమైన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ జాక్ క్రాలీ అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. భారత బౌలర్లనుదీటుగా ఎదుర్కొన్న క్రాలీ స్కోరును పరిగెత్తించాడు. మరో ఓపెనర్ బెన్ డకెట్ 11 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆరంగేట్రం మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్‌దీప్ ఈ వికెట్‌ను పడగొట్టాడు. ఆ వెంటనే ఓలి పోప్‌ను ఆకాశ్‌దీప్ ఔట్ చేశాడు. అతను ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. కొద్ది సేపటికే జాక్ క్రాలీ కూడా పెవిలియన్ చేరాడు. 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 42 పరుగులు చేసి క్రాలీను ఆకాశ్‌దీప్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 57 పరుగులకే మూడు వికెట్లను
కోల్పోయింది.

రూట్ ఒంటరి పోరాటం..
ఈ దశలో జోరూట్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను తనపై వేసుకున్నాడు. జానీ బెయిర్‌స్టోతో కలిసి కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఇద్దరు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. రూట్ సమన్వయంతో ఆడగా బెయిర్‌స్టో తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. ధాటిగా ఆడిన బెయిర్‌స్టో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 38 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ బెన్ స్టోక్స్ (3) పరుగులు మాత్రమే చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికి పోయాడు.దీంతో ఇంగ్లండ్ 112 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఒకవైపు వికెట్లు పడిపోతున్నా జో రూట్ తన పోరాటాన్ని కొనసాగించాడు. వికెట్ కీపర్ బెన్ ఫోక్స్‌తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ఫోక్స్ 126 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 47 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత వచ్చినఓలి రాబిన్సన్ 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 31 పరుగులు చేసి క్రీజులో నిలిచాడు. జో రూట్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 226 బంతుల్లో 9 ఫోర్లతో106 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News