- Advertisement -
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తెలుగుదేశం-జనసేన అభ్యర్థుల ఉమ్మడి తొలి జాబితా విడుదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంయుక్తంగా శనివారంనాడు తొలి జాబితాను ప్రకటించారు. జనసేనకు 24 అసెంబ్లీ, మూడు లోక్ సభ సీట్లను కేటాయించినట్లు చంద్రబాబు తెలిపారు. టీడీపీ తొలి జాబితాలో భాగంగా 94 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. తమ పార్టీ తరఫున ఐదు సీట్లకు అభ్యర్థులను పవన్ కల్యాణ్ ప్రకటించారు. మిగిలిన స్థానాలకు త్వరలో అభ్యర్ధులను ప్రకటిస్తామన్నారు.
- Advertisement -