Monday, January 20, 2025

చెలరేగుతున్న ఇంగ్లాండ్ బౌలర్లు.. ఏడో వికెట్ కోల్పోయిన భారత్

- Advertisement -
- Advertisement -

రాంఛీ: ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా తడబడింది. దీంతో తక్కువ స్కోరుకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డబుల్ సెంచరీలతో మెరుపులు మెరిపిస్తున్న యంగ్ ఓపెనర్ మరోసారి అర్థ శతకంతో రాణించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా అద్భుత బ్యాటింగ్ తో జట్టును ఆదుకున్నాడు. ఈ  క్రమంలో యశస్వి జైస్వాల్ 73 పరుగులు చేసి సోయబ్ బషీర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్(14) నిరాశపర్చాడు. దీంతో 177 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం టీమిండియా 64 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగలు చేసింది. క్రీజులో ధ్రువ్ జురైల్(20), కుల్దీప్ యాదవ్(14)లు ఉన్నారు. భారత్, ఇంగ్లండ్ కంటే ఇంకా 149 పరుగులు వెనుకబడి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News