Monday, December 23, 2024

జులై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాల అమలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్(ఐపిసి), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(సిఆర్‌పిసి) స్థానంలో కొత్త క్రిమినల్ చట్టాలుజులై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వం శనివారం ప్రకటించింది. దేశ క్రిమినల్ జసిస్సిస్టమ్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసే కొత్త క్రిమినల్ చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష అధినియం జులై 1 నుంచి అమలులోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఈ మేరకు మూడు నోటిఫికేషన్లను శనివారం విడుదల చేసింది. ఇందులో కొత్త చట్టాలకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం పొందుపరిచింది.

భారతీయ సాక్ష సంహిత, 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిల్లు, 2023, భారతీయ న్యాయ సంహిత, 2023 బిల్లును పార్లమెంట్ గత ఏడాది డిసెంబర్ 21న ఆమోదించింది. గత ఏడాది డిసెంబర్ 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో ఈ బిల్లులు చట్టరూపం దాల్చాయి. ఈ చట్టాలు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 1872, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1977, ఇండియన్ పీనల్ కోడ్‌లను భర్తీ చేయనున్నాయి. ఈ మూడు కొత్త చట్టాలు ఉగ్రవాదం, మూక హత్య, జాతీయ భద్రతకు ముప్పు తీసుకువచ్చే నేరాలకు మరింత కఠినమైన శిక్షలను వేయనున్నట్లు నిపుణులు తెలిపారు.

భారతీయ న్యాయ సంహితలో 20 కొత్త నేరాలను చేర్చగా ఐపిసిలో ఉన్న 19 నిబంధనలను కొత్త చట్టంలో తొలగించడం జరిగింది. 33 నేరాలలో జైలు శిక్షను పెంచడం జరిగింది. 83 నిబంధనలలో జరిమానా శిక్షను పెంచగా 33 నేరాలలో తప్పనిసరి కనీస శిక్షను ప్రవేశపెట్టడం జరిగింది. ఆరు నేరాలలో శిక్షగా సమాజ సేవను ప్రవేశపెట్టడం జరిగింది. కొత్త క్రిమినల్ చట్టాలలో ప్రతిపాదించిన ప్రధాన మార్పులలో చిన్నారి(చైల్డ్)కి నిర్వచనం ఇవ్వడం, జెండర్‌కి ఇచ్చిన నిర్వచనంలో ట్రాన్స్‌జెండర్‌ను చేర్చడం, డాక్యుమెంట్‌కు సంబంధించిన నిర్వచనంలో ఎలెక్ట్రానిక్, డిజిటల్ రికార్డులను చేర్చడం, చరాస్తికి చ్చిన నిర్వచనంలో అన్ని రకాల ఆస్తులను చేర్చడం వంటివి ఉన్నాయి. రాజ్యసభలోక్రిమినల్ చట్టాలను ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ కొత్త చట్టాలు అమలులోకి వచ్చిన తర్వాత వాయిదాల మీద వాయిదాలు పడే శకం పోయి మూడేళ్లలో తీర్పు వెలువడే వ్యవస్థ ఏర్పడుతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News