Friday, November 22, 2024

కోటాలో అదృశ్యమైన విద్యార్థి ధర్మశాలలో ప్రత్యక్షం

- Advertisement -
- Advertisement -

కోటా (రాజస్థాన్): కోటా లోని హాస్టల్ నుంచి అదృశ్యమైన 17 ఏళ్ల విద్యార్థి పీయూష్ ఆచూకీ ఎట్టకేలకు దాదాపు 11 రోజుల తరువాత ధర్మశాలలో లభ్యమైంది. ఉత్తరప్రదేశ్ లోని బులంద్‌షహర్‌కు చెందిన పీయూష్ గత రెండేళ్లుగా కోటా లోని ఇంద్రవిహార్ హాస్టల్‌లో ఉంటూ ఐఐటిజెఇఇ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. ఈనెల 13 నుంచి పీయూష్ జాడ కనిపించక పోవడంతో తల్లిదండ్రులు, అధికారులు ఆందోళన చెందారు. దీంతో పోలీస్‌లు రెండు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు.

పీయూష్ డెహ్రాడూన్‌లో ఉన్నట్టు ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు డెహ్రాడూన్, హరిద్వార్‌లో గాలించారు. చివరకు ధర్మశాలలో అతని ఆచూకీ లభించింది. పీయూష్‌ను పోలీస్‌లు అదుపు లోకి తీసుకున్నారు. ప్రస్తుతం పీయూష్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, అడిగిన సమాచారం ఇవ్వడం లేదని పోలీస్‌లు చెప్పారు. కోటాకు తీసుకు వచ్చిన తరువాత కౌన్సెలింగ్ ద్వారా సమాచారం సేకరించాలని అనుకుంటున్నారు. కోటా నుంచి ధర్మశాలకు వెళ్లడానికి దారి తీసిన పరిస్థితులేమిటో తరువాత విచారణలో తెలుస్తాయని భావిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News