Friday, December 20, 2024

26 నుండి అమెజాన్ ‘బిజినెస్ వేల్యూ డేస్’

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అమెజాన్ బిజినెస్ తమ వ్యాపార కస్టమర్ల కోసం ప్రత్యేకమైన డీల్స్, ఆఫర్స్ అయిన బిజినెస్ వేల్యూ డేస్‌ను 26 ఫిబ్రవరి నుండి ప్రారంభించనుంది. ఈ డీల్స్ మార్చి వ తేదీ వరకు కొనసాగుతాయి. అమెజాన్ బిజినెస్ కస్టమర్స్ లాప్ టాప్స్, ఆఫీస్ ఫర్నిచర్, చిన్న, పెద్ద ఉపకరణాలు స్మార్ట్ వాచెస్, హోమ్, కిచెన్ ఉపకరణాలు, యాక్ససరీస్, ఆఫీస్ ఉత్పత్తులు ఇంకా ఎన్నో ఇతర ఉత్పత్తుల పై మెరుగైన డీల్స్, ఆఫర్స్ పొందవచ్చు. కస్టమర్స్ తమ ప్రీ-పెయిడ్ ఆర్డర్స్ పై శ్రేణులలో క్యాష్ బాక్ ను ఆనందించవచ్చు.

ల్యాప్ టాప్, కంప్యూటర్ కొనుగోలుపై రూ. 5000 వరకు, యాక్ససరీస్ పై రూ.49,999 వరకు క్యాష్ బాక్ పొందవచ్చు. రూ. 6199కి పైగా ఆర్డర్స్ పై ఫర్నిచర్ కొనుగోలు పై రూ. 500 వరకు క్యాష్ బాక్, రూ. 2199కి పైగా హోమ్, కిచెన్ ఆర్డర్స్ పై రూ. 250 వరకు క్యాష్ బాక్ ఉంటుంది. ఇంకా మిక్సర్స్, జ్యూసర్స్, గ్రైండర్స్ వంటి హోమ్ అండ్ కిచెన్ ఉపకరణాలు పై కస్టమర్స్ 70 శాతం వరకు, ల్యాప్ టాప్స్ పై 60 శాతంవరకు తగ్గింపును పొందవచ్చు. కనీస వడ్డీ రేట్స్ కు 12 నెలల వరకు పొడిగించే ఆప్షన్ తో అర్హులైన కస్టమర్స్ తక్షణమే 30 రోజుల వడ్డీరహితమైన క్రెడిట్ పొందవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News