Monday, December 23, 2024

బయట పడుతున్న షణ్ముఖ్ సోదరుడి ఆగడాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యూట్యూబ్ నటుడు షణ్ముఖ్ సోదరుడి ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ వద్ద గంజాయి దొరకడంతో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో షణ్ముఖ్‌తో పాటు అతడి సోదరుడు సంపత్‌వినయ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు షణ్ముఖ్ సోదరుడు సంపత్‌ను విచారించగా అతని ఆగడాలన్నీ బయటపడుతున్నాయి. సంపత్ వినయ్ 2016లో తిక్‌షేక్ ప్రాంచైజ్ పేరుతో ఓ యువతి నుంచి రూ. 20 లక్షలు తీసుకుని మోసం చేశాడు. సంపత్ తన ఎంబీఏ క్లాస్‌మేట్ అయిన యువతికి మాయమాటు చెప్పి రూ. 20 లక్షలు పెట్టుబడి పేడితే భారీగా లాభాలు వస్తాయని చెప్పడంతో నమ్మి రూ.20లక్షలు ఇచ్చింది, వాటిని తీసుకున్న సంపత్ నెలకు రూ.7వేలు మాత్రమే లాభం వచ్చిందని మాయమాటలు చెప్పాడు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన యువతి తాను ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది.

అప్పటి నుంచి సంపత్ సదరు యువతి మొబైల్ నెంబర్‌ను, సోషల్ మీడియాలోనూ బ్లాక్ చేసేశాడు. పోలీసులు విచారణ చేస్తుండడంతో సంపత్ బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. ఇప్పటికే ఓ యువతితో నిశ్చితార్థం జరిగిన తర్వాత వివాహం ఆరు రోజులు ఉండగా మరో యువతీ డాక్టర్ దివ్య పూజతో వివాహానికి సిద్ధమయ్యాడు. సంపత్‌కు అప్పటికే ఎంగేజ్మెంట్ అయింది అని తెలిసినా మరో అమ్మాయి మోసపోయింది. అయితే, సంపత్ ముంబైలో మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. గత కొన్నేళ్లుగా సంపత్ సోదరుడు షణ్ముఖ్ వారి ప్లాట్‌లో గంజాయి సేవిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, విచారణలో మరిన్ని కీలక వివరాలు బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News