- Advertisement -
మేడారంలో వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పణ
మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండేలా దీవించాలని ఆదివాసీ వనదేవతలను కోరినట్లు బహుజన్‌సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర తెలంగాణ కుంభమేళా మేడారంలో శనివారం సమ్మక్క-సారలమ్మల గద్దెలను దర్శించుకుని నిలువెత్తు బంగారం సమర్పించారు.
బిఎస్‌పి అధికారంలోకి వచ్చిన వెంటనే దేశం గర్వించదగ్గ స్థాయిలో మేడారం జాతరను నిర్వహిస్తామని అన్నారు. మేడారం జాతరలో బిఎస్‌పి జిల్లా నాయకులు, ఆదివాసీ పూజారులు గిరిజన సాంప్రదాయ పద్ధతిలో ఆయనకు కండువా కప్పి ఘన స్వాగతం పలికారు. అనంతరం గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెల వద్దకు వెళ్లి మొక్కులు సమర్పించారుమన.
- Advertisement -