Sunday, November 17, 2024

సుదర్శన్ సేతును ప్రారంభించిన మోడీ

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: గుజరాత్‌లోని ద్వారకలోని సుదర్శన్ సేతును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దేశంలో 2.3 కిలో మీటర్ల అతి పొడవు గల తీగల వంతెనగా రికార్డుకెక్కింది. ఓఖా నుంచి బెట్ ద్వారకాను ఈ వంతెన కలుపుతుంది. 2017 అక్టోబర్‌లో ఈ వంతెన నిర్మాణానికి మోడీ శంకు స్థాపన చేయగా రూ.979 కోట్ల ఖర్చుతో నిర్మించారు. 27.2 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసలతో నిర్మించగా 2.5 మీటర్ల వెడల్పు ఫుట్‌పాత్ కూడా ఉంది. వంతెనకు ఇరువైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ వంతెనకు సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేయడంతో ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ద్వారకాదీశ్ ఆలయానికి వచ్చే భక్తులకు ఈ వంతెన ఉపయోగకరంగా ఉంటుంది. ద్వారకాదీశ్ ఆలయంలో ఆదివారం పిఎం నరేంద్ర మోడీ పూజలు చేయనున్నారు. ఆదివారం గుజరాత్(రాజ్‌కోట్), ఆంధ్రప్రదేశ్(మంగళగిరి), పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లలో కొత్తగా నిర్మించిన ఎయిమ్స్‌లను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ నాలుగు ఎయిమ్స్‌లకు కేంద్ర ప్రభుత్వం రూ.6300 కోట్లు ఖర్చు చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News