- Advertisement -
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఆదివారం ఉదయం కాంకేర్ జిల్లాలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సలైట్లు మరణించారని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. కోయలిబెడ ప్రాంతంలోని అడవిలో డ్రిస్టిక్ట్ రిజర్వ్ గార్డ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంయుక్తంగా నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ చేపట్టినట్లు కాంకేర్ పోలీస్ సూపరింటెండెంట్ ఇందిరా కళ్యాణి ఎలెసెలా తెలిపారు.
ఎన్‌కౌంటర్ స్థలం నుండి ఇప్పటివరకు ముగ్గురు నక్సలైట్ల మృతదేహాలు, రెండు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని, ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని అధికారి తెలిపారు.
- Advertisement -