Sunday, January 19, 2025

రాహుల్ యాత్రలో అఖిలేశ్

- Advertisement -
- Advertisement -

ఆదివారం ఆగ్రా యాత్రలో భాగస్వామిగా ఎస్‌పి చీఫ్
ఎస్‌పి, కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు అనంతర పరిణామం

ఆగ్రా : సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆదివారం ఆగ్రాలో రాహుల్ గాంధీ సారథ్యంలోని ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో చేరారు. రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఉత్తర ప్రదేశ్‌లో ఎస్‌పి, కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకం ఒప్పందం కుదిరిన కొన్ని రోజులకు ఈ పరిణామం సంభవించింది. ఎస్‌పి, కాంగ్రెస్ కార్యకర్తలు ఇద్దరు అగ్ర నేతలకు మద్దతుగా నినాదాలు చేశారు. ఇద్దరు నేతలు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో కలసి యాత్ర కోసం చేరిన జనం వైపు చేతులు ఊపారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఇప్పుడు రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. రైతుల బలానికి ప్రభుత్వం బెదురుతోంది. రానున్న కాలంలో బిజెపికి అధికార చ్యుతి కలుగుతుంది. ఇండియా కూటమి ప్రభుత్వం రైతులకు గౌరవం ఇస్తుంది’ అని అఖిలేశ్ చెప్పారు. వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీ వర్గాలకు సముచిత గౌరవాన్ని బిజెపి ఇవ్వలేదని అఖిలేశ్ ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత ప్రదీప్ మాథుర్ కూడా ఈ యాత్రకు హాజరయ్యారు. ‘రాహుల్‌జీ, ప్రియాంకజీ, అఖిలేశ్‌జీ నాయకత్వంలో మేము లోక్‌సభ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు సాధిస్తాం’ అని ప్రదీప్ మాథుర్ ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News