ముగ్గురు నక్సల్స్ మృతి ..గాలింపులు
కంకెర్ : చత్తీస్‌గఢ్‌లోని కంకెర్ జిల్లాలో ఆదివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కొయలిబెడా పోలీసు స్టేషన్ పరిధిలోరి భోమ్రా హుర్తారి గ్రామాల నడుమ ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో పరస్పర కాల్పులు జరిగాయి. ఈ దశలో ముగ్గురు నక్సలైట్లు చనిపోయారని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. ఓ కొండపై ప్రాంతంలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ మధ్యకాలంలో బస్తర్, కంకెర్ జిల్లాలో భద్రతా బలగాల గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
నక్సల్స్ ఏరివేతకు తరలిన భద్రతా బలగాల సంయుక్త దళానికి మావోయిస్టులకు మధ్య చాలా సేపు కాల్పులు జరిగాయని జిల్లా ఎస్‌పి ఇందిరా కళ్యాన్ ఎలెసెలా తెలిపారు.ఈ ప్రాంతంలో నక్సల్స్ ఉన్నారనే సమాచారంతో తమ బలగాలు అక్కడికి చేరుకున్నాయని ఎస్‌పి వివరించారు. కాల్పుల ఘటన తరువాత నక్సల్స్ సమీపంలోని దట్టమైన అడవుల్లోకి పారిపోయారు. తరువాత గాలించగా అక్కడ ముగ్గురు నక్సల్ మృతదేహాలు పడి ఉన్నాయని గుర్తించారు. చనిపోయిన వారి పూర్వాపరాలను ఇప్పటికీ గుర్తించలేదని అధికారులు తెలిపారు. ఘటనాస్థలిలో పెద్ద ఎత్తున నక్సల్స్ సాహిత్యం , ఇతరత్రా సామాగ్రి కనుగొన్నారు.