లక్నో: ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టి అనంతరం బ్యానెట్‌పై మూడు కిలో మీటర్లు ఈడ్చుకెళ్లిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రమేశ్ సింగ్, తరంగ్ జైన్ అనే వ్యక్తుల రెండు కార్లు ఢీకొనడంతో ఇద్దరు వాహనంలో నుంచి దిగి గొడవకు దిగారు. జైన్ కారును ముందుకు తీసుకెళ్తుండగా రమేశ్ అడ్డుగా నిలబడ్డాడు. జైన్ వేగంతో రమేశ్‌ను ఢీకొట్టడంతో కారు బ్యానెట్ పట్టుకున్నాడు. అలా మూడు కిలో మీటర్లు డ్రైవ్ చేశాడు. బ్యానెట్‌పై ఉన్న రమేశ్‌ను వాహనదారులు గమనించి కారును బలవంతంగా ఆపి అతడిని కాపాడారు. అనంతరం స్థానికులు జైన్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్థానిక ఎసిపి స్వతంత్ర కుమార్ సింగ్ తెలిపారు.
#गाजियाबाद में सरेआम गुंडागर्दी, एक युवक को दबंगों ने कार की बोनट पर लटकाया और 3 किलोमीटर तक घुमाया #Ghaziabad
कौशांबी थाना क्षेत्र की घटना है। पूरी घटना का वीडियो वायरल #virals pic.twitter.com/I6pV1vnci8— U NEWS UP (@UNEWSUP) February 25, 2024
Road rage taken to the extreme! In Indirapuram, a shocking incident unfolded when a pedestrian was struck by a car, clinging on for life as the driver sped away. Thanks to vigilant bystanders, the culprit has been arrested. #Ghaziabad #RoadSafety #Indirapuram @kumar6875 pic.twitter.com/wyIaGXiAtI
— Local Post (@localpostit) February 25, 2024