రాంఛీ: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో ధ్రువ్ జురెల్ చేసిన 90 పరుగులపై క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 177 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత జట్టును 307 పరుగులకు చేర్చిన ఘనత జురెల్‌కు దక్కుతుంది. టెయిలెండర్ల సహాయంతో 149 బంతులు ఆడి 90 పరుగుల చేసి భారత జట్టు మెరుగైన స్థానంలో ఉంచడంతో కీలక పాత్ర పోషించాడు. ఎనిమిదో వికెట్‌పై కుల్దీప్ యాదవ్‌తో కలిసి అతడు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రాంచీ టెస్టు మ్యాచ్‌లో చేసిన హాఫ్ సెంచరీని ఆయన తన తండ్రికి అంకితమిచ్చాడు. కీపర్ జురెల్‌ను టిమిండియా బెస్ట్ ఫినిషర్ రింకూ సింగ్ ప్రశంసించారు. తన సహోదరుడి కలలు నిజమయ్యే తరుణం ఆసన్నమైందని రింకూ కొనియాడారు. తన సహచర ఆటగాడిపై ప్రేమను తెలియజేశాడు. దేశవాలీ క్రికెట్‌లో ఉత్తర ప్రదేశ్‌కు జట్టుకు రింకూ సింగ్, ధ్రువ జురెల్ ఆడుతుండడం ఇద్దరు మంచి స్నేహం ఉంది. భారత జట్టుకు మరో ధోనీ దొరికాడని టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ జురెల్‌పై ప్రశంసల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. వసీం జాఫర్, వీరేంద్ర సెహ్వాడ్ వంటి మాజీ బ్యాట్స్‌మెన్లు ధ్రువ్ బ్యాటింగ్ శైలిని కొనియాడారు.
నా సహోదరుడా… నీ కలలు నిజమయ్యే తరుణం ఇది: రింకూ
- Advertisement -
- Advertisement -
- Advertisement -