- Advertisement -
హైదరాబాద్ మహా నగరం కాలుష్య కాసారంగా మారుతోందా? గ్రీన్ పీస్ ఇండియా తాజా అధ్యయనంలో అదే తేలింది. హైదరాబాద్… దక్షిణ భారతదేశంలో అత్యంత కాలుష్య మెట్రో నగరమని అధ్యయనం స్పష్టం చేసింది. దక్షిణ భారతదేశంలోని పలు నగరాల్లో కాలుష్యం స్థాయుల గురించి తెలుసుకునేందుకు గ్రీన్ పీస్ ఇండియా సంస్థ నిర్వహించిన సర్వేలో భాగ్యనగరం మొదటిస్థానాన్ని ఆక్రమించినట్లు తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు మించి హైదరాబాద్ లో కాలుష్యం 14 రెట్లు అధికంగా ఉందట. దేశంలో అధికంగా కాలుష్యాన్ని వెదజల్లే నగరాల లిస్టులో ఢిల్లీ మొదటిస్థానంలో ఉండగా, కోల్ కతా, హైదరాబాద్ ఆ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి.
- Advertisement -