Sunday, January 19, 2025

రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులు విడుదలయ్యారు!

- Advertisement -
- Advertisement -

రష్యన్ సైన్యంలో పనిచేస్తున్న అనేకమంది భారతీయులను ఇప్పటికే విడిపించామని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తాము చేసిన విజ్ఞప్తి మేరకు భారతీయులను రష్యా తమ సైన్యంలోంచి తప్పించిందని పేర్కొంది.

రష్యాలో ఉన్న భారతీయులను బలవంతంగా సైన్యంలో పనిచేయిస్తున్నారని, వారంతా ప్రస్తుతం ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో పాల్గొంటున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడిపించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయానికి తెలియజేశామని, అక్కడి అధికారులు రష్యా ప్రభుత్వంతో చర్చలు జరిపి, సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడిపించారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News