Saturday, December 21, 2024

టీడీపీలో చేరుతున్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే, ఎంపీ!

- Advertisement -
- Advertisement -

వైఎస్సార్ సీపీనుంచి టిడిపిలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తన నియోజకవర్గం ప్రజలను ఉద్దేశించి రాసిన లేఖలో త్వరలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నానని చెప్పారు. ఎంపీ అభ్యర్థిగా మళ్లీ మీ ముందుకు వస్తున్నాననీ పేర్కొంటూ మరొకసారి అవకాశమిస్తే అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్తానన్నారు.

కృష్ణాజిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తాను రెండు రోజుల్లో టిడిపిలో చేరబోతున్నట్లు విలేఖరులకు చెప్పారు. ‘దేవినేని ఉమతో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు. పార్టీ అగ్రనేతల సమక్షంలో నేనూ, దేవినేనీ కలసి మాట్లాడుకుంటాం. చంద్రబాబును, లోకేశ్ ను తిడితేనే మైలవరం టికెట్ ఇస్తామని జగన్ చెప్పారు. ఆ పార్టీలో ఉండలేక టిడిపిలో చేరుతున్నా’ అని వసంత చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News