Saturday, November 23, 2024

వ్యవసాయరంగాన్ని కార్పోరేట్ కంపెనీలకు కట్టబెట్టే కుట్రలు

- Advertisement -
- Advertisement -

కేంద్రం దిగిరాకపోతే మార్చి 14న ఛలో ఢిల్లీ

మనతెలంగాణ/హైదరాబాద్:  దేశ వ్యవసాయరంగాన్ని కార్పోరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు మోడి ప్రభుత్వం కుట్రలు పన్నతోందని సంయుక్త కిసాన్ మోర్చా అరోపించింది. ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి భారత్ బయటకు రావాలని డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కిసాన్‌మోర్చా అధ్వర్యంలో సోమవారం , కార్మిక, ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు సుందరయ్య పార్కూ నుండి ఆర్ టి సి క్రాస్ రోడ్ వరకు వాహన ర్యాలీ నిర్వహించారు.అనంతరం కిసాన్ సంయుక్త మోర్చా రాష్ట్ర కన్వీనర్ లు టి సాగర్ మాట్లాడుతూ… డబ్ల్యూటీవో నుండి భారతదేశం బయటకు రావాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని విదేశీ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు పూనుకుంటున్నదని అన్నారు.

ఫిబ్రవరి 26న అబుదాబీలో కాన్ఫరెన్స్ ప్రారంభం కానుందని, వ్యవసాయరంగంలో రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరలను నిమంజూరు చేయకుండా భారత ప్రభుత్వాన్ని బలవంతం చేయడంతో పాటు రైతులకు ఇస్తున్న సబ్సిడీలు తగ్గించాలని డబ్యుటివో ఒత్తిడి చేస్తున్నదని అన్నారు. ప్రజలకు నేరుగా డబ్బులు బదిలీ చేయాలని ఒత్తిడి చేయడం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను ఉపసంహరించుకోవడానికి డబ్యుటివో ఒత్తిడి చేస్తున్నదని,ఈ ప్రతిపాదనలు రైతులకు, పేద ప్రజలకు, ఆహార భద్రతకు భారతదేశ సార్వభౌమత్వానికి హానికరం అని అన్నారు. డబ్యుటిఓను దేశం నుండి తరమాలని పిలుపునిచ్చారు.

రైతుల పోరాటం పై నిర్భందానికి వ్యతిరేకంగా దేశం అంతటా రైతులను చైతన్యవంతం చేయాలని కోరారు. ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలో రైతుల నిరసన స్థలంలో రైతుల ట్రాక్టర్లను పోలీసులు ధ్వంసం చేశారన్నారు. రైతులపై అణచివేత ప్రయోగించడం, రైతు ఉద్యమాన్ని ఏకాకిని చేసి విభజించేందుకు కుట్ర పన్నారని, ఈ విభజనతో ఎన్నికల ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అలాగే మృతుల కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, పాడైన ట్రాక్టర్ల మరమ్మతు ఖర్చులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ,గ్రామాన పాదయాత్రలు నిర్వహించాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే మార్చి 14న ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఆందోళనలో పార్టీలకతీతంగా రైతులు, ప్రజలు భాగస్వాములు కావాలని సాగర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సోమన్న,కిషన్ (సీఐటీయూ), యం.హన్మేష్ (ఐ ఎఫ్ టి యు),మూడ్ శోభన్ ( రైతు సంఘం), బుర్రి ప్రసాద్, బొప్పని పద్మ( వ్యవసాయ కార్మిక సంఘం), ఆర్. శ్రీరామ్ నాయక్, యం. ధర్మా నాయక్ ( గిరిజన సంఘం), స్వరూప, వరలక్ష్మి, లక్ష్మి బాయి,పుష్ప(పిఓడబ్యు)కోట రమేష్,జావెద్ (డివైఎఫ్ ఐ), కెయస్ ప్రదీప్ (పివైఎల్),తాళ్ళ నాగరాజు, అశోక్ రెడ్డి,లెనిన్ గువేరా (ఎస్‌ఎఫ్‌ఐ) యస్ నాగేశ్వరావు, మహేష్, అనిల్ (పిడియస్ యు) తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News