Monday, December 23, 2024

ప్రెస్ అకాడమి ఛైర్మన్‌ శ్రీనివాస రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన అకాడమీ సిబ్బంది

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా నియమితులైన సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ రెడ్డిని మీడియా అకాడమీ అధికారులు సిబ్బంది నేడు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో అకాడమీ చేయవలసిన కార్యక్రమాల గురించి నిశితంగా చర్చించారు చర్చలో మీడియా అకాడమీ సెక్రటరీ నాగులపల్లి వెంకటేశ్వరరావు, మేనేజర్ వెంకటేశం, అకౌంట్స్ అధికారి పూర్ణచంద్రరావు, లైబ్రరీ వనజ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి: జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు
జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు సోమవారం ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డిని కలిశారు. ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించిన సందర్భంగా వారు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు జర్నలిస్టులకు సంబంధించిన పలు సమస్యలను… ముఖ్యంగా జర్నలిస్టుల ఇళ్ళ స్థలాలకు సంబంధించిన అంశంపై వారు ఆయనతో చర్చించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారమే పేట్ బషీరాబాద్‌కు 38 ఎకరాలను సొసైటీకి ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా శ్రీనివాస రెడ్డి వారికి హమీ ఇచ్చారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News