Saturday, December 21, 2024

ఇందిరమ్మ రాజ్యం… సంక్షేమ రాజ్యంగా అడుగులు వేస్తోంది

- Advertisement -
- Advertisement -

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

మన తెలంగాణ / హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని రాష్ట్ర సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో 43 వేల ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించిన ఈ రోజు కార్మిక లోకానికి సంక్షేమ రాజ్యంలో చారిత్రాత్మకమైన రోజని, ఇందిరమ్మ రాజ్యం సంక్షేమ రాజ్యంగా అడుగులు వేస్తోందన్నారు. కార్మిక లోకానికి కోటి రూపాయల ప్రమాద బీమా దేశంలో అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణలోని ఇందిరమ్మ రాజ్యం మాత్రమే అన్నారు.

లోకానికి వెలుగులు ఇస్తున్న సింగరేణి కార్మికులను కాపాడుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోటి రూపాయల ప్రమాద బీమా తీసుకొచ్చిందని తెలిపారు.దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ , కాంట్రాక్టు కార్మికులకు 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయల ప్రమాద భీమా పథకం ప్రారంభించామన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు 30 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. సింగరేణి సంస్థ పై రూపాయి భారం పడకుండా 70 వేల మంది కార్మికులకు ప్రమాద బీమా కల్పిస్తున్నామన్నారు. సింగరేణి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తీసుకొచ్చిన ఉన్నతమైన కార్యక్రమాన్ని ప్రజలు అభినందించాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News