Friday, January 3, 2025

మహేష్ బాబు వాయిస్‌తో ఫోన్‌పే స్మార్ట్ స్పీకర్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబుతో కలిసి తన స్మార్ట్ స్పీకర్లలో తొలిసారిగా సెలబ్రిటీ వాయిస్ ఫీచర్‌ను ఫోన్‌పే ప్రారంభించింది. ఈ కొత్త ఫీచర్ దేశవ్యాప్తంగా తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లోనూ మహేష్ బాబు విభిన్న స్వరంలో కస్టమర్ పేమెంట్లను ధృవీకరించడానికి ఫోన్‌పే స్మార్ట్‌స్పీకర్లను అనుమతిస్తుంది. సగటున ఫోన్‌పే స్మార్ట్‌స్పీకర్లు తెలంగాణలో 10.9 కోట్ల నెలవారీ లావాదేవీలను నిర్వహిస్తున్నాయి. ఫోన్‌పే మర్చంట్ బిజినెస్ విభాగం చీఫ్ బిజినెస్ ఆఫీసర్ యువరాజ్ సింగ్ షెకావత్ మాట్లాడుతూ, 3.8 కోట్ల మందికి పైగా మర్చంట్లతో కూడిన నెట్‌వర్క్ భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో విస్తరించి ఉందని అన్నారు. వివిధ ప్రఖ్యాత సెలిబ్రటీలతో భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడం ద్వారా మర్చంట్ల విభిన్న అవసరాలను సృజనాత్మక మార్గంలో అందించడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News