Saturday, December 21, 2024

5 శాతానికి పడిపోయిన పేదరికం

- Advertisement -
- Advertisement -

పటిష్టంగా గ్రామీణ వినియోగ వ్యయం
పట్టణ ప్రాంత వినియోగ వ్యయంతో అంతరం తగ్గుదల

రంగరాజన్ నిర్వచనం ప్రకారం దేశంలో భారీగా తగ్గిన పేదరికం
నీతి ఆయోగ్ సిఇఒ సుబ్రమణ్యం విశ్లేషణ

న్యూఢిల్లీ : గృహ వినియోగ వ్యయంపై అర్థ గణాంకాల శాఖ విడుదల చేసిన తాజా సర్వే ప్రకారం, గ్రామీణ ప్రాంత వినియోగం పటిష్ఠంగా కొనసాగుతోందని, పట్టణ ప్రాంత వినియోగ వ్యయంతో అంతరం తగ్గుతోందని, దేశంలో పేదరికం స్థాయి బాగా తగ్గిందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయని నీతి ఆయోగ్ సిఇఒ బివిఆర్ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ‘ఈ డేటా ప్రాతిపదికగా దేశంలో పేదరికం స్థాయి 5 శాతానికి దగ్గరగా లేక ఇంకా తక్కువగా ఉండవచ్చు’ అని సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ డేటా ప్రకారం గ్రామీణ ప్రాంతంలో లోటు దాదాపు అదృశ్యమైందని భావించవచ్చునని ఆయన అన్నారు. రీటైల్ ద్రవ్యోల్బణం సూచిలో ఆహారం, తృణ ధా న్యాల వాటా తక్కువగా ఉన్నందున ఆర్‌బిఐ నిర్దేశించే వడ్డీ రేటుపై ఈ గణాంకాల ప్రభావం ఉండవచ్చునని ఆయన అ న్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిస్థితిపై అనుమానాలను ఈ డేటా తోసిపుచ్చిందని ఆయన చెప్పారు. గృహ వినియోగ వ్యయంపై తాజా డేటా గ్రామీణ, పట్టణ ప్రాంత వినియోగం లో గణనీయ మార్పులను సూచించింది. ఆహార, తృణ ధా న్యాల వాటా తగ్గింది.

ఫ్రిజ్, టెలివిజన్, బెవరేజ్‌లు, ప్రాసెస్ చేసిన ఆహారం, వైద్య సేవలు, రవాణా వంటి ఆహారేతల వ స్తువులపై వ్యయం ఇదే కాలంలో పెరగగా, తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు వంటి ఆహార పదార్థాలపై వ్యయం మందగించింది. ప్రస్తుత ధరల ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం 2011–12లోని రూ. 1430 నుంచి 2022-23లో రూ. 3773కు అంటే 164 శాతం మే ర పెరిగింది. పట్టణ కేంద్రాలలో 2011—-12లోని రూ. 2630 నుంచి 2022-23లోని రూ. 6459కి అంటే 146 శాతం మేర పెరిగింది. గ్రామీణ ప్రాంతాలలో నెలవారీ వినియోగ వ్యయంలో ఆహారం వాటా 2011–12లోని 53 శా తం నుంచి 2022-23లో ని 46.4 శాతానికి పడిపోయింది. పట్టణ కేంద్రాలలో అదే సరళి కానవచ్చింది. అక్కడ ఆహారంపై వ్యయం 2011—-12లోని 43 శాతం నుంచి 2022-23లోని 39.2 శాతానికి తగ్గింది. అయితే, ఆహారేతర వ్య యం 2011—-12లోని 57.4 శాతం నుంచి 2022-23లోని 60.8 శాతానికిపెరిగిందని సర్వే తెలిపింది. ‘ఆహారంలో బెవరేజ్‌లు, ప్రాసెస్ చేసిన ఆహారం, పాలు, పండ్లపై వ్యయం పెరుగుతోంది. మరింత వైవిధ్యమైన, సమతూకమైన వినియోగానికి ఇది సూచిక’ అని నీతి ఆయోగ్ సిఇఒ బివిఆర్ సుబ్రహ్మణ్యం తెలియజేశారు. తృణధాన్యాలు, ఆహారం వాటా త గ్గుదల కారణంగా రీటైల్ ద్రవ్యోల్బణాన్ని లెక్కించే వినిమయ ధ రల సూచి (సిపిఐ)ని తిరిగి రూపొందించడానికి తాజా డేటా దారి తీస్తుందని ఆయన సూచించారు.

బహుశా లోగడ సంవత్సరాలలో తక్కువగా ఉండవచ్చు.. అంటే ద్రవ్యోల్బణా న్ని మరీ ఎక్కువగా పేర్కొన్నారన్న మా ట. ఆహారం వాటా ఎ క్కువగా ఉంటున్నందున అది బహు శా తక్కువగా ఉండవ చ్చు’ అని సుబ్రహ్మణ్యం అన్నారు. ఆర్‌బిఐ ద్రవ్య విధానంపై దీని ప్రభావం ఉండవచ్చునని ఆయన సూచించారు. నెలవారీ తలసరి వ్యయం పట్టణ ప్రాంతాలలో రూ. 1407 గాను, గ్రామీణ ప్రాంతాలలో రూ. 972 గాను దారిద్య్ర రేఖగా ఆర్‌బిఐ మాజీ గవర్నర్ సి. రంగరాజన్ 2014లో అం చనా వేశారు. జనాభాలో 5, 10 శాతం వరకు సగటు నెలవారి వినియోగ వ్యయం గ్రామీణ ప్రాంతాలలో రూ. 1864 అని, పట్టణాల్లో రూ. 2695 అని తాజా డేటా సూచించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News