Saturday, November 23, 2024

పతంజలి ఆయర్వేదకు కోర్టు ధిక్కరణ నోటీసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రోగాలను నయం చేయడానికి సంబంధించి తప్పుదారి పట్టించే వ్యాపార ప్రకటనలు ప్రచురించనందుకు పతంజలి ఆయుర్వేద కంపెనీతోపాటు దాని మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు సుప్రీంకోర్టు మంగళవారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది. అంతేగాక చట్టంలో నిర్దేశించిన మేరకు వ్యాధులు లేదా రుగ్మతలకు సంబంధించి తమ ఉత్పత్తులపై వ్యాపార ప్రకటనలు చేయరాదంటూ యోగా గురు బాబా రాందేశ్ స్థాపించిన పతంజలి ఆయుర్వేదను సుప్రీంకోర్టు ఆదేశించింది.

వ్యాక్సినేషన్ కార్యక్రమానికి, ఆధునిక మందులకు వ్యతిరేకంగా వ్యాపార ప్రకటనలు, దుష్ప్రచారాన్ని చేపట్టిన పతంజలి ఆయుర్వేదపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇండియన మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా ధర్మాసనం చేపట్టిన విచారణ సందర్భంగా పతంజలి ఆయుర్వేదపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా పతంజలి ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపార ప్రకటనలు చేసే సాహసం ఎలా చేస్తారంటూ కోర్టు ప్రశ్నించింది.

శాశ్వత ఉపవమన అంటూ వ్యాపార ప్రకటనలు చేయడం పట్ల కోర్టు అభ్యంతరం తెలిపింది. శాశ్వత ఉపశమన అంటే ఏమిటో వివరించాలని ఆదేశించింది. ఎటువంటి ప్రకటనలు విడుదల చేయబోమంటూ గత ఏడాది నవంబర్‌లో కోర్టుకు హామీ ఇచ్చిన తర్వాత కూడా వ్యాధుల నివారణ పేరిట ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలు ఎలా ప్రచురిస్తారని కోర్టు ప్రశ్నించింది. తమ ఉత్పత్తులను సంబంధించి ఎటువంటి ప్రకటన చేయరాదని ఆదేశిస్తూ కేసు విచారణను రెండు వారాల తర్వాత చేపడతామని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News