- Advertisement -
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ప్రతిష్ఠాత్మక మానవసహిత రోదసీయాత్ర ‘గగన్ యాన్’ కోసం నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసింది. వారి పేర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత బాలకృష్ణన్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ సుభాంషు శుక్లా ఈ రోదసీ యాత్రలో పాల్గొననున్నారు. ఇండియానుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షానికి వెళ్తున్న తొలి వ్యోమగాముల బృందం ఇదే కావడం విశేషం.
గగన్ యాన్ గురించి ఇస్రో ఐదేళ్ల క్రితమే ప్రకటించింది. రోదసీ యాత్రకు ఎంపికైన వ్యోమగాములు ప్రస్తుతం బెంగళూరులోని ఆస్ట్రోనాట్ శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో జరుగుతున్న ఏర్పాట్ల గురించి ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు.
- Advertisement -