Friday, December 20, 2024

ఢిల్లీలో 5 లోక్‌సభ స్థానాలకు ఆప్ అభ్యర్థుల ప్రకటన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ, హర్యానాలోని ఐదు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మంగళవారం ప్రకటించింది. పార్టీ సీనియర్ నాయకుడు సోమనాథ్ భారతిని న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ బరిలోకి దింపింది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం అనంతరం ఐదుగురు అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. ఢిల్లీ జల బోర్డు ఉప చైర్మన్‌గా ఉన్న సోమనాథ్ భారతిని న్యూఢిల్లీ నియోజకవర్గం అభ్యర్థిగా ఆప్ ప్రకటించింది.

అలాగే తూర్పు ఢిల్లీ నుంచి కొండ్లి ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్‌ను, దక్షణి ఢిల్లీ నుంచి సహీరాం పహెల్వాన్‌ను, పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపి మహాబల్ మిశ్రాను అభ్యర్థులుగా పార్టీ ప్రకటించింది. హర్యానాలోని కురుక్షేత్ర లోక్‌సభ నియోజకవర్గానికి అభ్యర్థిగా మాజీ రాజ్యసభ సభ్యుడు సుశీల్ గుప్తాను ఆప్ ప్రకటించింది. ఢిల్లీలో ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్‌తో ఆప్ సీట్ల సర్దుబాటు ఒప్పందం చేసుకుంది. ఢిల్లీలో ఆప్ నాలుగు స్థానాలలో, కాంగ్రెస్ మూడు స్థానాలలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. అస్సాంలో మూడు స్థానాలకు, గుజరాత్‌లో రెండు లోక్‌సభ స్థానాలకు ఆప్ ఇప్పటికే తన అభ్యర్థులను ప్రకటించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News