Friday, November 22, 2024

సైన్యంలో చేరిన స్వదేశీ మోడ్యులర్ బ్రిడ్జి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : 46 మీటర్ల పొడవైన స్వదేశీ తయారీ మోడ్యులర్ బ్రిడ్జిని మంగళవారం సైన్యంలో చేర్చారు. ఢిల్లీ లోని మనెక్‌షా సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్‌పాండే , ఆర్మీ అండ్ లార్సెన్ , టోబ్రో ( ఎల్ అండ్ టి ) సీనియర్ అధికారులు పాల్గొన్నారు. వచ్చే నాలుగేళ్లలో మొత్తం 41 సెట్ల మోడ్యులర్ బ్రిడ్జిలను చేర్చడమౌతుందని, వీటి విలువ రూ.2585 కోట్లని సీనియర్ అధికారులు తెలిపారు. వీటిలోమొదటి సెట్ ను మంగళవారం సైన్యంలో చేర్చారు.

డిఫెన్స్ రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఒ) ఈ బ్రిడ్జిలకు రూపకల్పన చేసి అభివృద్ధి చేయగా, ఎల్ అండ్ టీ తయారు చేయగలిగింది. కాలువలు, గుంతలు, తదతర ఆటంకాలను సైన్యం అధిగమించడానికి వేగంగా వాటిని దాటడానికి ఈ మోడ్యులర్ బ్రిడ్జిలు ఉపయోగపడతాయి. ఈ బ్రిడ్జీలు ఒక చోట నుంచి మరో చోటికి సులువుగా తీసుకు వెళ్లవచ్చు. ఈ బ్రిడ్జీల తయారీకి ఎల్ అండ్ టి సంస్థతో 2023 ఫిబ్రవరిలో ఒప్పందం కుదిరింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News