Thursday, November 21, 2024

అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ దంపతులపై చార్జిషీట్

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీపై 190 మిలియన్ పౌండ్ల అల్ ఖదీర్ అవినీతి కేసులో పాకిస్తాన్‌లోని అకౌంటబిలిటీ కోర్టులో మంగళవారం చార్జిషీట్ దాఖలైంది. వివిధ అవినీతి కేసులలో పాకిస్తాన్ తె
హ్రీక్ ఇన్సాఫ్ పార్టీ వ్యవస్థాపకుడు 72 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. కోర్టులో ఇమ్రాన్ ఖాన్, బుష్రా సమక్షంలో న్యాయమూర్తి చార్జిషీట్ చదివి వినిపించారు. అల్ ఖదీర్ యూనివర్సిటీ ట్రస్టు పేరిట ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య, మరి కొందరు వందలాది కాల్వలతో కూడిన భూములను సేకరించారని ఆరోపణలు నమోదయ్యాయి. దీని వల్ల రాష్ట్ర ఖజానాకు 190 మిలియన్ పౌండ్ల నష్టం వాటిల్లిందని పాకిస్తాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

ఈ ఆరోపణలపై నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్‌ఎబి) దర్యాప్తు చేపట్టింది. అభియోగాలను నమోదు చేసే ముందు ఇమ్రాన్ ఖాన్‌ను, ఆయన భార్యను నేరం చేశారని ఒప్పుకుంటున్నారా అని ప్రశ్నించగా వారు లేదని జబావాబిచ్చారు. ఈ కేసులో 58 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తామని న్యాయమూర్తి తెలిపారు. కేసు తుదపరి విచారణను మార్చి 6వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. తోషాఖానా అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ దంపతులకు అకౌంటబిలిటీ కోర్టు ఇదివరకే 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇస్లామాబాద్‌లోని తమ బనీ గలా నివాసంలో 49 ఏళ్ల బుష్రా ఖైదీగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News