Sunday, November 24, 2024

చంద్రుని రెండో వారం రాత్రిని తట్టుకున్న జపాన్ మూన్ ల్యాండర్

- Advertisement -
- Advertisement -

టోక్యో : జపాన్ మొదటి మూన్ ల్యాండర్ చంద్రునిపై రెండోవారం అతి శీతల రాత్రిని తట్టుకుని నిలదొక్కుకుంది. భూమి నుంచి పంపుతున్న సంకేతాలకు స్పందిస్తోందని జపాన్ స్పేస్ ఏజెన్సీ ( జాక్సా ) సోమవారం వెల్లడించింది. ఆదివారం రాత్రి భూమి నుంచి ఒక కమాండ్ పంపాం. దానికి స్లిమ్ ( స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టింగ్ మూన్ ) స్పందన వచ్చింది. రాత్రివేళ కూడా అది కమ్యూనికేషన్ సామర్థాన్ని కాపాడుకున్నట్టు అయిందని జాక్సా పేర్కొంది.

ఇది అద్భుతమని, చంద్రుడిపై రాత్రి వేళలో ఉండే మైనస్ 170 డిగ్రీల సెల్సియస్ శీతల వాతావరణాన్ని తట్టుకునేలా దీన్నిరూపొందించలేదని జాక్సా తెలియజేసింది. ఆదివారం నాడు చంద్రునిపై ఇంకా పగటిలో సగం భాగమే ఉన్నందున కమ్యూనికేషన్ కొద్దిగా మాత్రమే జరిగిందని జాక్సా వివరించింది. అప్పుడు స్లిమ్ 100 డిగ్రీల సెల్సియస్( 212 డిగ్రీల ఫారన్‌హీట్) లో ఉంది. అయితే వాహక నౌక చల్లబడగానే మళ్లీ అనుసంధానం చేయడానికి జాక్సా సన్నాహాలు చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News