Monday, December 23, 2024

మాజీ మంత్రి కెటిఆర్‌కు నిరసన సెగ

- Advertisement -
- Advertisement -

అంబర్‌పేట్‌లో కెటిఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న యూత్ కాంగ్రెస్ నేతలు

మనతెలంగాణ/హైదరాబాద్:  బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్‌కు హైదరాబాద్‌లో నిరసన సెగ ఎదురైంది. మంగళవారం అంబర్‌పేట్‌లో యూత్ కాంగ్రెస్ నేతలు కెటిఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ‘కెటిఆర్ గో బ్యాక్’ అంటూ ఫ్లకార్డులు పట్టుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గత పదేళ్లలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఊసెత్తని బిఆర్‌ఎస్ సర్కార్ నేడు సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని బిఆర్‌ఎస్ నాయకులను ఊర్లలో తిరగనివ్వబోమని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. అప్రమత్తమైన సెక్యూరిటీ ఆందోళనకారులను పక్కకు తీసుకెళ్లడంతో కెటిఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News