Monday, December 23, 2024

ఎసిబి డిజి నకిలీ ఫ్రొఫైల్ సృష్టించిన యువకుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: ఎసిబి డిజి సివి ఆనంద్ పేరుతో నకిలీ ప్రొఫైల్ సృష్టించి పలువురిని డబ్బులు అడుగుతున్న యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన యువకుడు (22) ఐఎఎస్, ఐపిఎస్, వైద్యులు, ఎంపిలు, ఎమ్మెల్యేల పేరుతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాంలో నకిలీ ఖాతాలు ఓపెన్ చేస్తున్నాడు. వాటి నుంచి పలువురికి మెసేజ్‌లు పంపిస్తూ తనకు అత్యవసరంగా డబ్బులు అవసరం ఉందని పంపించాలని కోరుతున్నాడు.

ఇది నిజమని కొందరు డబ్బులు పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ఎసిబి డిజి సివి ఆనంద్ పేరుతో నిందితుడు ఫేస్‌బుక్‌లో నకిలీ ఐడి సృష్టించి డబ్బులు కావాలని పలువురికి మెసేజ్‌లు పంపిస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో ఎసిబి డిజి సివి ఆనంద్ ఎసిబి ఇన్‌స్పెక్టర్‌తో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ సైదులు, ఎస్సై ప్రసేన్‌రెడ్డి, పిసిలు విజయ్‌కుమార్, నరేష్, సతీష్, తిరుమలేష్, మనికంఠ తదితరులు దర్యాప్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News