Monday, December 23, 2024

58 ఏళ్ల వయసులో సిధూ మూసేవాలా తల్లికి మళ్లీ గర్భం

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: హత్యకు గురైన పంజాబీ గాయకుడు సిధూ మూసేవాలా తల్లిదండ్రులు త్వరలోనే మరో బిడ్డకు స్వాగతం పలకనున్నారు. సిధూ తల్లి చరణ్ సింగ్ ఐవిఎఫ్ ద్వారా బిడ్డకు జన్మనివ్వనున్నారు. సిధూ తల్లి చరణ్ సింగ్ ఐవిఎఫ్ చికిత్స పొందారని, గర్భం దాల్చిన ఆమె మార్చిలో శిశువుకు జన్మనివ్వనున్నారని వారి కుటుంబ వర్గాలు ధ్రువీకరించాయి. ఆ దంపతులకు ఏకైక సంతానమైన సిధూ 2022 మేలో హత్యకు గురయ్యారు. సిధూ తల్లి చరణ్ సింగ్‌కు ప్రస్తుతం 58 సంవత్సరాలుగా తెలుస్తోంది.

2022లో మాన్సా నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సిధూకు డమ్మీ అభ్యర్థిగా ఆమె పోటీ చేసినపుడు అఫిడవిట్‌లో తన వయసును 58 ఏళ్లుగా చూపారు.పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో సిధూ మూసేవాలా హత్యకు గురయ్యారు. తన బంధువు, మిత్రుడితో కలసి తన స్వగ్రామం మూసాకు 10 కిలోమీటర్ల దూరంలోని మాన్సాలోని జవహర్కే గ్రామానికి జీపులో వెళుతుండగా ఆరుగురు షూటర్లు సిధూపై కాల్పులు జరిపారు. ఆయన హత్యపై పంజాబ్ పోలీసుకు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తు చేపట్టింది. పేరుమోసిన గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్, జగ్గూ భగ్వాన్‌పురియాతోసహా 32 మందిని నిందితులుగా సిట్ తన చార్జిషీట్‌లో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News