మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ ’ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించాయి. గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలు. ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు..
ప్రతి సీన్‌ని రెండు భాషల్లో షూట్ చేశాం…
దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ 2020లో ఈ కథతో నన్ను సంప్రదించారు. నాకు కథ చాలా నచ్చింది. నేను సోనీ పిక్చర్స్‌తో అంతకుముందు ఓ సినిమా చేయాలి. కానీ అది కొన్ని కారణాల వలన టేకాఫ్ కాలేదు. ఈ కథ వారికి పంపించినపుడు వారికీ నచ్చింది. వాళ్ళు కూడా అన్నీ వార్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీస్తున్నారు. నేషనల్ అప్పీల్ వున్న కంటెంట్ ఇది. చాలా గ్రాండ్ బడ్జెట్‌తో పక్కాగా ప్లాన్‌తో సినిమాని చేశారు. ప్రతి సీన్‌ని తెలుగు, హిందీ రెండు భాషల్లో షూట్ చేశాం.
చాలా రీసెర్చ్ చేశాడు…
దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ ప్రత్యేకంగా ఈ కథనే నా ద్వారా చెప్పాలని అనుకున్నాడు. ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశాడు. అంతకుముందు తను చేసిన షార్ట్ ఫిల్మ్ చాలా వైరల్ అయ్యింది. ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా అది చూసి ఆశ్చర్యపోయారు. దీనిపై సినిమా చేయాలనుకున్నపుడు ఇంకా కావాల్సిన సమాచారం ఇస్తామని వారు చెప్పారు. ఈ కథని చాలా పాషన్‌తో చేశాడు. తనకి వీఎఫ్ఎక్స్పై కూడా చాలా మంచి పట్టు వుంది. నటీనటుల నుంచి పర్ఫార్మెన్స్ని చాలా అద్భుతంగా రాబట్టుకునే నేర్పు తనలో వుంది.
ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే సినిమా…
2019, ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీర మరణం పొందారు. దానికి కారణమైన శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత వైమానిక దళం ఆపరేషన్ నిర్వహించింది. ఫిబ్రవరి 14న ఈ సర్జికల్ స్ట్రయిక్స్ చోటు చేసుకుంది. వాలెంటైన్ డే రోజు జరిగింది కాబట్టి శత్రువులకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్‌గా ఈ ఎటాక్ ప్లాన్ చేయడం జరిగింది. ఈ సినిమాలో వాలెంటైన్ అంటే ప్రతి ఒక్కరికీ దేశం మీద వున్న ప్రేమ. ఎయిర్ ఫోర్స్ అధికారులకు ఈ సినిమా చూపించాం. పుల్వామా ఘటన పై ఇప్పటివరకూ వచ్చిన సినిమాల్లో ’ఆపరేషన్ వాలెంటైన్’ ది బెస్ట్ అని వారు ప్రసంశించారు. ప్రతి భారతీయుడు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే సినిమా ఇది.
నా పాత్ర చాలా అద్భుతంగా…
ఇలాంటి పాత్రలు చేయడం ఒక ఛాలెంజ్. ఫ్లైట్ సీన్లో ముఖం మొత్తం ఆక్సిజన్ మాస్క్‌తో కప్పబడి వుంటుంది. ఎమోషన్ని కళ్ళతోనే పలికించాలి. ఇందులో రుద్ర పాత్రలో కనిపిస్తాను. కొందరు రియల్ ఎయిర్ ఫైటర్స్ స్ఫూర్తితో నా పాత్రని చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు దర్శకుడు. రుద్ర పాత్రతో అందరూ చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు.
పాటలు మనసుని హత్తుకుంటాయి…
మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ విన్నర్‌గా దేశానికి పేరు తీసుకొచ్చారు. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది. రాడార్ ఆఫీసర్‌గా కనిపించడానికి చాలా హోం వర్క్ చేసింది. మిక్కీ జే మేయర్ బ్రిలియంట్ కంపోజర్. ఇందులో పాటలు ఎమోషనల్‌గా వుంటాయి. మనసుని హత్తుకుంటాయి. అలాగే నేపధ్య సంగీతం కూడా చాలా బలంగా వుంటుంది.