Monday, December 23, 2024

వైఎస్‌ఆర్‌సిపికి మరో దెబ్బ… ఎంపి మాగుంట రాజీనామా

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి మరో షాక్ తగిలింది. వైఎస్‌ఆర్‌సిపికి ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఒంగోలులో మాగుంట మీడియాతో మాట్లాడారు. తాను 33 ఏళ్లుగా రాజకీయాలలో ఉన్నానని, 11 చట్టసభలకు పోటీ చేశానని, మాగుంట అంటేనే ఒక బ్రాండ్ అని తెలిపారు. మాగుంట కుటుంబానికి అహం లేదని, ఆత్మగౌరవంతోనే ఉన్నానని, అన్నివార్య పరిస్థితుల్లో వైసిపిని వీడాల్సి వచ్చిందని తెలియజేశారు. ఒంగోలు ఎంపి బరిలో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీలో ఉంటారని పేర్కొన్నారు. ఆరుగురు ఎంపిలు వైసిపిని వీడిన విషయం తెలిసిందే. ఐదుగురు లోక్‌సభ సభ్యులు, ఒక రాజ్యసభ ఎంపి ఉన్నారు. వైసిపిని రాజీనామా చేసిన వారిలో నర్సాపురం ఎంపి రఘురామకృష్ణరాజు, నరసరావుపేట ఎంపి శ్రీకృష్ణదేవరాయలు, కర్నూలు ఎంపి సంజీవ్ కుమార్, మచిలీపట్నం ఎంపి వల్లభనేని బాలశౌరి, రాజ్యసభ సభ్యులు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News