Monday, December 23, 2024

వ్యూహం మూవీకి లైన్ క్లియర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

- Advertisement -
- Advertisement -

జగన్ జీవితకథ ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం మూవీకి అడ్డంకులు తొలగిపోయాయి. ఎట్టకేలకు ఈ మూవీకి సెన్సార్ సర్టిఫికెట్ లభించింది. మూవీలో 22 చోట్ల మ్యూట్ లు వేయాలనీ, రెండు సన్నివేశాలను పూర్తిగా తొలగించాలని సెన్సార్ బోర్డు సూచించింది. చంద్రబాబు, పవన్ పేర్లను పాత్రలకు పెట్టడంపైనా అభ్యంతరం తెలిపింది. ఈమేరకు మార్పులు, చేర్పులు చేసి సినిమాను మార్చి 2వ తేదీన రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించారు.

వ్యూహం మూవీపై తెలుగుదేశం పార్టీ కేసులు పెట్టడంతో మొదటినుంచీ అడ్డంకులు ఎదురవుతూనే వచ్చాయి. సెన్సార్ పూర్తయిన తర్వాత నారా లోకేశ్ వేసిన కేసు కారణంగా సెన్సార్ సర్టిఫికెట్ ను రద్దు చేశారు. ఆ తర్వాత మరోసారి సెన్సార్ బోర్డు పరిశీలించి పలు మ్యూట్లు, కట్లతో ఓకే చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News