Saturday, December 21, 2024

అత్యాచారం కేసులో నిందితుడికి 51ఏళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

ఇదుక్కి: కేరళలోని మున్నార్‌లో తన 17 ఏళ్ల పెంపుడు కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన ఒక 40 ఏళ్ల వ్యక్తికి కేరళ కోర్టు 51 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. పోక్సో చట్టంతోపాటు, ఐపిసిలోని వివిధ సెక్షన్ల కింద నిందితుడికి మొత్తం 51 సంవత్సరాల కారాగార శిక్షను దేవికుళం ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు(పోక్సో) న్యాయమూర్తి సిరాజుద్దీన్ పిఎ విధించినట్లు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఎస్‌పిపి) స్మిజూ కె దాస్ బుధవారం తెలిపారు.

అయితే ఒక వ్యక్తి గరిష్ఠంగా 20 ఏళ్లు జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని, అందుకే నిందితుడికి ఏకకాలంలో ఆ శిక్షను విధించడం జరిగిందని ఎస్‌పిపి తెలిపారు. ఇంత అత్యధిక కాలం జైలు శిక్షను ఒక న్యాయమూర్తి విధించడం ఇదే మొదటిసారని ఆయన చెప్పారు. అంతేగాక నిందితుడికి రూ.1.55 లక్షల జరిమానాను న్యాయమూర్తి విధించారని, ఆ మొత్తాన్ని బాధితురాలికి అందచేయవలసి ఉంటుందని ఆయన చెప్పారు.

బాధితురాలికి నష్టపరిహార పథకం కింద పరిహారాన్ని అందచేయాలని కూడా న్యాయమూర్తి సిఫార్సు చేశారు. దీనికి సంబంధించి ఇదుక్కి తోడుపుళా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఆదేశాలు ఇచ్చారు. 2018లో బాధితురాలి ఇంట్లో లేని సమయంలో ఆమెపై ఆమె పెంపుడు తండ్రి మూడు వేర్వేరు రోజులలో అత్యాచారానికి పాల్పడినట్లు ఎస్‌పిపి తెలిపారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే బాధితురాలిని, ఆమె 34 ఏళ్ల తల్లిని చంపివేస్తానని కూడా నిందితుడు బెదిరించినట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News