- Advertisement -
అవినీతి, డ్రగ్స్, రౌడీయిజం లేని ఆంధ్రప్రదేశ్ సాధనే తమ లక్ష్యమని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ చెప్పారు. రానున్న ఎన్నికల్లో చిన్నచిన్న పార్టీలతో పొత్తుపెట్టుకుని అన్ని స్థానాలకూ పోటీ చేస్తామన్నారు. తాను విశాఖపట్నం నుంచి బరిలోకి దిగుతానని ప్రకటించారు. ఆయన శ్రీకాకుళంలో తమ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సిపి స్వప్రయోజనాలకోసం రాష్ట్రాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టిందని లక్ష్మినారాయణ విమర్శించారు. ఇప్పుడు ఎన్నికలు రావడంతో మళ్లీ ప్రత్యేక హోదా అంటూ కొత్త డ్రామాలు మొదలు పెడుతున్నారని అన్నారు. విద్యార్థులు మార్చి 1న తలపెట్టిన చలో తాడేపల్లి ప్యాలెస్ ఆందోళనకు ఆయన మద్దతు ప్రకటించారు.
- Advertisement -