Sunday, December 22, 2024

అఖిలేశ్‌కు సిబిఐ సమన్లు

- Advertisement -
- Advertisement -

లఖ్‌నవూ: ఎస్పీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం అఖిలేశ్ యాదవ్‌కు బుధవారం సిబీఐ సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్ వ్యవహారానికి సంబంధించి కేసు విచారణలో భాగంగా సాక్షిగా ఆయనను పిలిచింది. గురువారం ఆయనను ప్రశ్నించనున్నామని దర్యాప్తు సంస్థ వర్గాలు వెల్లడించాయి. అక్రమ మైనింగ్‌కు సంబంధించి రాష్ట్రం లోని ఏడు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి.

2012 నుంచి 2016 మధ్య కాలంలో నిబంధనలను ఉల్లంఘించి అధికారులు గనులను కేటాయించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యం లోనే సిబిఐ దర్యాప్తు జరుపుతోంది. 2012 నుంచి 2017 మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అఖిలేశ్ పని చేశారు. 2012 13లో మైనింగ్ విభాగం బాధ్యతలు పర్యవేక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News