Monday, December 23, 2024

టిడిపి మాజీ మంత్రి కొడుకు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కొడుకు పత్తిపాటి శరత్ అరెస్ట్ అయ్యాడు. జీఎస్టీ ఎగవేత, మనీలాండరింగ్ కేసులో కృష్ణా జిల్లా మాచవరం పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. శరత్ అవెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని నడుపుతున్నాడు. టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించిన జాబితాలో చిలుకలూరిపేట నుంచి ప్రత్తిపాటి పుల్లారావు టిక్కెట్ దక్కించుకున్న విషయం తెలిసిందే. జీఎస్టీ ఎగవేశారన్న ఆరోపణలతో ఆయనపై మాచవరం పోలీసులు కేసు బుక్ చేశారు. అత‌డిపై జిఎస్టీ అధికారులు ఫిర్యాదు చేయ‌డంతో విచారణ జరిపిన పోలీసులు శరత్‌ను అరెస్ట్ చేశారు.

శరత్ అరెస్ట్‌పై భగ్గుమన్న టిడిపి శ్రేణులు అరెస్టును ఖండించారు. ఎపి ఎన్నికలు సమీపిస్తున్నవేళ పోలీసులతో కుమ్మక్కై అధికార పార్టీ నేతలు కావాలనే టిడిపి నాయకులను అరెస్ట్ చేయిస్తున్నారని మండిపడ్డారు. ఆందోళనకు దిగిన టిడిపి లోకల్ నేతలు శరత్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో పత్తిపాటిని ఢీకొట్టలేకనే ఇలాంటి కుట్రలకు తెర తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News