Monday, December 23, 2024

కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్

- Advertisement -
- Advertisement -

లబ్ధిదారుల ఖాతాలో త్వరలో రూ. 78 వేలు

న్యూఢిల్లీ : కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ను అందించే పథకానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మొత్తం రూ.75,021 కోట్లతో కోటి ఇళ్లలో రూఫ్ టాప్ సోలార్‌ను ఏర్పాటు చేసేందుకు సంబంధించిన ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకు మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్య పౌరులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఫిబ్రవరి 13 న ప్రధాన మంత్రి ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రజలపై కరెంటు బిల్లుల భారం పడకుండా సౌర విద్యుత్ వాడకాన్ని కేంద్రం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా తాజా పథకాన్ని ప్రకటించింది.

ఈ పథకంలో సౌర విద్యుత్ ఫలకలు అమర్చుకునే వారికి భారీగా రాయితీలు ప్రకటించింది. దానితోపాటు బ్యాంకు రుణాలు కూడా అందిస్తోంది. ఈ పథకం 1 కెడబ్లు విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సోలార్ సిస్టమ్‌కు రూ. 30,000 సబ్సిడీ , 2 కెడబ్లు సిస్టమ్‌కు రూ. 60,000 , 3 కెడబ్లు లేదా అంతకంటే ఎక్కువ సామర్థం కలిగిన సోలార్ వ్యవస్థకు రూ. 78,000 సబ్సిడీని అందిస్తోంది. ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విదుయత్ అందించి కోటి కుటుంబాలలో వెలుగులు నింపాలన్నదే ఈ పథకం లక్షం. ఈ పథకం కింద అందించే సబ్సిడీలను నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రధాని గతంలో తెలియజేశారు. 2025 నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర మంత్రి అనురాగ్‌ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. ఈ సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు వెబ్‌సైట్‌లో గృహ వినియోగదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News