Monday, December 23, 2024

అన్నదాతలకు ఎరువుల సబ్సిడీ

- Advertisement -
- Advertisement -

దేశంలోని వ్యవసాయదారులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఎరువు సబ్సిడీ నిర్ణయం కూడా తీసుకుంది. మంత్రి మండలి ఆమోదించిన వాటిలో ఖరీఫ్ సీజన్‌కు ఫాస్పేట్, పొటాసియం (పికె) ఎరువులకు రూ 24,420 కోట్ల మేర సబ్సిడీని ఖరారు చేసే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఇక భూసార పౌష్టికంగా వాడే డిఎపి ఇకపై కూడా క్వింటాలుకు రూ 1,350గా కొనసాగుతుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ఠాకూర్ విలేకరులకు చెప్పారు. డిఎపితో పాటు ఇతరత్రా పికె ఎరువులకు కూడా ఇప్పటి ధరలే ఉంటాయి. 2024-25 ఖరీఫ్ పంటకాలం అంటే ఎప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకూ ఈ ధరల వర్తింపు కొనసాగుతుంది. ఇప్పుడు 50 కిలోల డిఎపి ఎరువు మార్కెట్‌లో రూ 1350కే విక్రయిస్తున్నారు. ఈ ధరలే కొనసాగుతాయి. తమ ప్రభుత్వం పూర్తిగా రైతు మిత్రత్వ పద్థతినే పాటిస్తుందని దీనికి అనుగుణంగానే రైతులకు పోటాషియం ఇతరత్రా ఎరువులను తక్కువ ధరలకే విక్రయించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News