Sunday, December 22, 2024

లోక్‌సభలో ఎన్నికల్లో కాంగ్రెస్,బిజెపి మధ్య ఎన్నికల పోరు: డికె అరుణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోరు ఉంటుందని, మెజార్టీ సీట్లు తమ పార్టీ కైవసం చేసుకుంటుందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి. కె. అరుణ పేర్కొన్నారు. ఎంపి అభ్యర్థుల తొలి జాబితాపై కసరత్తులు జరుగుతున్న నేపధ్యంలో మీడియాతో మాట్లాడుతూ తొలి జాబితాలో తెలంగాణ నుంచి ఎక్కువ సీట్లు ప్రకటించే అవకాశం ఉందని, ఒక్కో నియోజకవర్గం నుంచి 5మందికి పైగా పేర్లు ఉన్నాయని, గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నవాళ్లకే సీటు దక్కుతుందన్నారు. దేశమంతా మోడీ మేనియా నడుస్తొందని, దక్షిణ భారతదేశం నుంచి మెజార్టీ స్థానాలు గెలవనున్నామని, ఎన్నికల్లో తెలంగాణ తరుపున 10 నుంచి 12 స్థానాలు గెలిచి మోడీకి బహుమతిగా ఇస్తామని చెప్పారు.

వివిధ పార్టీలకు చెందిన నాయకులు మోడీకి ఆకర్షితులు అవుతున్నారని, ఇంకా కొందరు సీనియర్లు తమకు టచ్‌లో ఉన్నారని, వారితో చర్చలు జరుగుతున్నాయని, చర్చలు ముగిసిన అనంతరం వారిని పార్టీలో చేర్చుకుని ఎన్నికలకు వెళ్లుతామని తెలిపారు. తెలంగాణలో త్రిముఖ పోటీ లేదని జాతీయ పార్టీల మధ్య మాత్రమే ఉంటుందన్నారు. గత ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పి అధికారం చేపట్టిన తరువాత పార్లమెంటు ఎన్నికల్లో 17 సీట్లు గెలిపిస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఆపార్టీ నేతలతు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ గ్యారెంటీలు నమ్మరరని, ప్రధాని గ్యారెంటీని బలంగా నమ్ముతున్నారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News