Sunday, December 22, 2024

ప్రేమపెళ్లి… వీధుల్లో పరుగెత్తించి భార్యను నరికిన భర్త

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు… దంపతుల మధ్య గొడవ రావడంతో పెళ్లి రోజునే భార్యను భర్త హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కాకినాడలో 2016 ఫిభ్రవరి 29న నూకరాజు(28), దివ్యవ(26) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు పాప, బాబు ఉన్నారు. నూకరాజు ఫ్యాబ్రికేషన్‌లో కాంట్రాక్టు పనులు చేస్తుంటాడు. రెండు మూడు రోజులు బయటకు వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి దంపతుల మధ్య గొడవలు జరగడంతో బంధువులు వచ్చి వారికి సర్ది చెప్పారు.

గురువారం ఉదయం ఇద్దరు మద్య గొడవ జరగడంతో ఇంట్లో నుంచి పెద్దగా కేకలు వినిపించాయి. భార్యభర్తల మధ్య గొడవ పడుతున్నారనుకొని ఎవరు పట్టించుకోలేదు. ఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకోవడంతో కత్తి తీసుకొని ఆమెపై దాడి చేయబోయాడు. ఆమె తప్పించుకొని వీధుల్లో పరుగులు తీస్తుండగా భార్యపై పలుమార్లు కత్తితో దాడి చేశాడు. తోడికోడలు అడ్డురావడంతో ఆమెపై కూడా కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. అడ్డు వస్తే చంపేస్తానని బెదిరించడంతో ఆమె పక్కకు జరిగింది. కత్తి తీసుకొని మెడ, తలపై వేటువేయడంతో ఆమె చనిపోయింది. గ్రామస్థుల సమాచారం మేరకు సిఐ సురేష్ బాబు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News