Friday, December 20, 2024

మేడిగడ్డకు బయలుదేరిన బిఆర్ఎస్ నేతలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి రైతుల కంటే రాజకీయమే ముఖ్యమైందా? అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రశ్నించారు. శుక్రవారం ఉదయం తెలంగాణ భవన్ నుంచి మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు బిఆర్‌ఎస్ నేతలు బయలుదేరారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంలో తప్పు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోవాలని కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వర్షాకాలం వచ్చేలోపు ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మినహా మేడిగడ్డకు మిగతా బిఆర్‌ఎస్ నేతలు వెళ్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పరిశీలించిన తరువాత అన్నారం బ్యారేజీని పరిశీలించనున్నారు. అన్నారం వద్ద బిఆర్‌ఎస్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News