Monday, November 25, 2024

ఖమ్మంలో మిర్చి రైతుల ఆందోళన

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: ఖమ్మం మిర్చి మార్కెట్‌లో అన్నదాతలు ధర్నా చేస్తున్నారు. వ్యాపారులు మిర్చి ధరలు తగ్గించి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ మధుసూదన్ నాయక్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేయడంతో పాటు మార్కెట్ గేట్లు మూసివేశారు. మార్కెట్‌లో ప్రస్తుతం మిర్చి కొనుగోళ్లు నిలిచిపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జెండా పాట ధర క్వింటాల్‌కు రూ.20,800 ప్రకటించారు. కానీ రైతుల నుంచి రూ.14 వేల నుంచి 16 వేల మధ్య వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News